మంత్రులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్

ఆంధ్ర అసెంబ్లీలో కాళేశ్వరం పంచాయితీ ఐదేళ్లు బాబు గాడిదలు కాస్తున్నాడా..?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే అధికార,ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి జగన్ వెళ్లటంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కాళేశ్వరం కడితే ఆంధ్రప్రదేశ్ ఎడారి అవుతుందని ఇదే జగన్ కర్నూల్ లో మూడు రోజులు జల దీక్ష చేశాడు. కేసీఆర్ ఒక హిట్లర్, కేసీఆర్ ఒక నియంత అంటూ మాట్లాడిన, జగన్ నేడు అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయి టెంకాయ కొట్టి రావటం ఏమిటంటూ విమర్శలు చేశాడు.

దీనితో సీఎం జగన్ మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రి అయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కి వెళ్ళింది ఎప్పుడు, దానిని స్టార్ట్ చేసి, కట్టింది ఎప్పుడు. చంద్రబాబు నాయుడు హయాంలోనే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఆలమట్టి డ్యామ్ ఎత్తుని 519 మీటర్ల నుండి 524 మీటర్లకి పెంచారు. దీనితో 110 tmc కెపాసిటీ పెరిగింది. దీని వలన ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టం జరుగుతుంది, ఇవేమి అప్పటి ముఖ్యమంత్రికి తెలియలేదా, అప్పుడేమి గాడిదలు కాస్తున్నాడా అంటూ జగన్ మాట్లాడటంతో ఒక్క సరిగా అసెంబ్లీలో అలజడి రేగింది. జగన్ మాట్లాడిన మాటలకు టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినా సరే జగన్ ఎక్కడ కూడా తగ్గకుండా తన వాదనలను వినిపించాడు.

Leave a Reply