రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచిన వైఎస్ జగన్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు : వైసీపీ గ్యారెంటీగా గెలిచే స్థానాలు ఇవే..!

Share This

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రికి వారు లెక్క‌లు వేసుకుంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హీటు పెంచేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌ధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీలు మేమంటే మేమే గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక జ‌న‌సేన కూడా మేము రేసులోనే ఉన్నామంటున్నారు.

ఈ క్ర‌మంలో ప‌లు స‌ర్వేలు తెర‌పైకి వ‌చ్చి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఒక‌వైపు పార్టీ నేత‌ల వ్యాఖ్య‌లు, మ‌రోవైపు రాజ‌కీయ నిపుణుల విశ్లేష‌ణ‌లు, ఇంకోవైపు సర్వేలు అన్నీ క‌లిపి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నాయి. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ప్ర‌స్తుతం వ‌స్తున్న స‌ర్వేల‌న్నీ వైసీపీకే గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నాయి.

ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు కూడా 120 సీట్లు ప‌క్కా అంటున్నారు. అయితే వైసీపీ గ్యారెంటీగా గెలిచే స్థానాల పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో జిల్లాల వారిగా చేయించిన లోక‌ల్ స‌ర్వేలో వైసీపీ నేత‌లు చెబుతున్న‌ట్లు 120 సీట్లు కాదు కానీ 90 సీట్ల‌లో అయితే సింపుల్‌గానూ, గ్యారెంటీగానూ.. గెలుస్తార‌ని తేలింది. ఇంకో 20 నుండి 25 స్థానాల్లో ట‌ఫ్‌ఫైట్ నడిచినా.. ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉంద‌ని ఆ స‌ర్వే అంచ‌నా వేసింది. మిగ‌తా స్థానాల్లో టీడీపీకి, అందులో 5 నుండి 8 స్థానాల్లో జ‌న‌సేన‌కు గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఆ స‌ర్వే తేల్చేసింది.

ఇక వైసీపీ గ్యారెంటీగా గెలిచే స్థానాలు ఇవే…

* కడప జిల్లా : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

పులివెందుల, కడప, బద్వేలు, పొద్దుటూరు, కమలాపురం, రాయచోటి, రైల్వే కోడూరు, మైదుకూరు, రాజంపేట 9

* కర్నూలు జిల్లా : మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

* నంద్యాల, పాణ్యం, మంత్రాలయం, ప్రత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు

* అనంతపురం : మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

అనంతపురం అర్బన్, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, పుట్టపర్తి, క‌దిరి

* చిత్తూరు జిల్లా – మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 7 స్థానాల్లో గెలిచే చాన్స్ ఉంది.

పుంగనూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు, నగరి, గంగాధరనెల్లూరు.

* నెల్లూరు : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, సూళ్లూరుపేట.

* ప్రకాశం : మొత్తం 12 సీట్లకు గాను వైసీపీ 8 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

చీరాల, మార్కాపురం, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, దర్శి, కందుకూరు, కనిగిరి, కొండెపి.

* గుంటూరు : మొత్తం 17 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

సత్తెనపల్లి, బాపట్ల, రేపల్లె, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్. మాచర్ల

* కృష్ణా జిల్లా : మొత్తం 16 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

పామర్రు, తిరువూరు, గుడివాడ, నూజివీడు, కైకలూరు, విజయవాడ వెస్ట్

* ప.గో. జిల్లా : మొత్తం 15 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

పోలవరం, కొవ్వూరు, భీమవరం, నరసాపురం, చింతలపూడి, ఆచంట

* తూ.గో జిల్లా : మొత్తం 19 సీట్లకు గాను వైసీపీ 8 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

తుని, కొత్తపేట, కాకినాడ సిటీ, రూరల్, ప్రతిపాడు, అమలాపురం, పి.గన్నవరం, జగ్గంపేట.

* విశాఖపట్నం : మొత్తం 15 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

పాడేరు, అరకు, నర్సీపట్నం, చోడవరం, భీమిలి, పాయకరావు పేట

* విజయనగరం జిల్లా : మొత్తం 9 సీట్లకు గాను వైసీపీ 5 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

కురుపాం, సాలూరు, చీపురుపల్లి, పార్వతీపురం, గజపతినగరం

* శ్రీకాకుళం : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 5 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

నరసన్నపేట, పాలకొండ, ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం.