అసోం ఎన్‌ఆర్‌సీ జాబితాలో లేని పౌరులకు ఊరట…

అసోం ఎన్‌ఆర్‌సీ జాబితాలో లేని పౌరులకు ఊరట లభించింది. జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఫారిన్ ట్యైబ్యునల్‌ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించారు. నాలుగు నెలల్లోపు ఫారిన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పౌరుల సౌలభ్యం కోసం 100 ట్రైబ్యునల్స్‌కు అదనంగా మరో 200 ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. నిజమైన పౌరులను తప్పని సరిగా జాబితాలో చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అస్సాం రాష్ట్రానికి చెందిన పౌర‌స‌త్వ తుది జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో సుమారు 19.06 ల‌క్ష‌ల మందిని పౌర‌స‌త్వం నుంచి తొల‌గించారు. తుది జాబితాలో సుమారు 3.11 కోట్ల మందికి అవ‌కాశం క‌ల్పించారు. గ‌త ఏడాది ఎన్ఆర్‌సీ ముసాయిదాను త‌యారు చేశారు. ఆ జాబితాలో సుమారు 40 ల‌క్ష‌ల మందిని వ‌దిలేశారు.