అవెంజర్సా... మజాకా?... టికెట్లకు ఫుల్ డిమాండ్!

అవెంజర్సా… మజాకా?… టికెట్లకు ఫుల్ డిమాండ్!

Share This

ఆరు ఇన్ఫినిటీ స్టోన్స్ ను సొంతం చేసుకుని విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకోవాలని థానోస్ చేసే ప్రయత్నాలను ప్రపంచ సూపర్ హీరోస్ తమ చివరి పోరులో ఎలా ఎదుర్కొంటారు? ప్రపంచ సినీ అభిమానులు ఇప్పుడు అత్యంత ఆసక్తితో చూస్తున్న చిత్రమిదే. మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థార్, బ్లాక్ విడో, వార్ మెషీన్, కెప్టెన్ మార్వెల్ తదితరులు థానోస్ ను ఎలా ఎదుర్కొంటారో చూసేందుకు చిన్నారులతో పాటు పెద్దలు సైతం ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని థియేటర్లలో వారాంతం వరకూ టికెట్ల బుకింగ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక నిన్న ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగా, హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ వద్ద టికెట్ల కోసం క్యూ సుమారు కిలోమీటర్ దూరం సాగడం గమనార్హం. ఈ వేసవిలో తమ పిల్లలకు సినిమాను చూపించేందుకు తల్లిదండ్రులు క్యూలో నిలబడటం గమనార్హం.