అరగంటలో లక్షన్నర వ్యూస్... దూసుకెళుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'!

అరగంటలో లక్షన్నర వ్యూస్… దూసుకెళుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’!

ఈ ఉదయం 9.27 గంటలకు నెట్టింట్లోకి వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రయిలర్ నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. ఈ ట్రయిలర్ ను వీక్షించేందుకు నెటిజన్లు పోటీ పడుతున్నారు. సరాసరిన నిమిషానికి 5 వేల వ్యూస్ వస్తున్నాయి. ట్రయిలర్ ను అప్ లోడ్ చేసిన తరువాత తొలి 16 నిమిషాల్లోనే 65 వేలకు పైగా వ్యూస్ రాగా, అరగంట వ్యవధిలో లక్షన్నర వ్యూస్ కు చేరుకుంది. ఇక, ఈ ట్రయిలర్ పై టీడీపీ అభిమానులు మండిపడుతుండగా, రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్, ఇతర పార్టీల వారు ‘సూపర్బ్’ అని కామెంట్లు పెడుతున్నారు. లక్ష్మీ పార్వతిగా యజ్ఞా శట్టి చక్కగా కుదిరారని కితాబులు కూడా వస్తున్నాయి. ట్రయిలర్ లో చూపించిన కొన్ని పాత్రలపై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి కూడా.