‘అమ్మఒడి’ పథకంపై ప్రశంసలు కురిపించిన టీడీపీ నేత కేశినేని నాని!

Share This

అమ్మఒడి చాలా గొప్ప పథకం
ప్రతీ తల్లికి రూ.15 వేలు అందుతాయి
ఇంగ్లిష్ విద్యాబోధన పెరగాల్సిన అవసరముంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు గుప్పించే తెలుగుదేశం నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని తొలిసారి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం చాలా గొప్ప పథకమని కితాబిచ్చారు. ఈ పథకం విధివిధానాలు సరిగ్గా ఉంటే ప్రతీ తల్లికి సంవత్సరానికి రూ.15,000 అందుతాయని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలే దేవాలయలనీ, ఆ స్కూళ్లే ఎంతో మంది మేధావులను దేశానికి అందించాయని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ విద్యాబోధన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ‘నేను ఎవరిని పొగడటం లేదమ్మా.. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దు. నేను ఎవరినీ పొగడటం లేదు’ అని కేశినేని నాని స్పష్టం చేశారు.
Tags: Andhra Pradesh, Vijayawada, Telugudesam, Amma Vodi, Great Scheme Praise, Kesineni Nani