అమిత్ షా తో భేటీ అయిన స్వామి పరిపూర్ణానంద

బీజేపీ అధిష్ఠానం పిలిస్తే ఢిల్లీ వెళ్లిన పరిపూర్ణానంద
కొద్ది సేపటి క్రితం అమిత్ ను కలిసిన స్వామిజీ
బీజేపీలో పరిపూర్ణానంద చేరడం దాదాపు ఖరారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద కొద్ది సేపటి క్రితం కలిశారు. బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఈరోజు అత్యవసరంగా ఆయన ఢిల్లీకి వెళ్లారు. కాగా, బీజేపీలో పరిపూర్ణానంద చేరడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆయనను సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపాలని, అలా కుదరని పక్షంలో ఎంపీగానైనా వచ్చే ఎన్నికల బరిలో పరిపూర్ణానందను నిలపాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది.