అధికారం ఇచ్చిన ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు!: కేవీపీ రామచంద్రారావు

అధికారం ఇచ్చిన ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు!: కేవీపీ రామచంద్రారావు

Share This

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కారణంగానే ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. తన వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు బీజేపీతో లాలూచీ పడ్డారని విమర్శించారు. ఎన్నికల ముందు బీజేపీతో గొడవలు పెట్టుకుని రాష్ట్రానికి మరికొంత నష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ విభజన తర్వాత ప్రజలు అధికారం అప్పగిస్తే, వారందరికీ చంద్రబాబు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రమే చేపడుతుందని విభజన చట్టంలోనే ఉందని కేవీపీ గుర్తుచేశారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయనతో భాగస్వామ్యం కాలేమని కేవీపీ రామచంద్రారావు స్పష్టం చేశారు.