అద్భుతమైన విజువల్స్ తో ఆశ్చర్యపరిచే 'అంతరిక్షం'

అద్భుతమైన విజువల్స్ తో ఆశ్చర్యపరిచే ‘అంతరిక్షం’

సముద్రంలో .. ‘జలాంతర్గామి’ నేపథ్యంలో ‘ఘాజీ’ ని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి ప్రేక్షకులచే ఔరా! అనిపించాడు. ఆ తరువాత సినిమాగా ఆయన ‘అంతరిక్షం’ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాను గురించి సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ .. “ఈ సినిమాలో అంతరిక్షానికి సంబంధించిన విజివల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తాయి. తామే అంతరిక్షంలో ఉన్నంతగా ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఉత్కంఠను రేకెత్తించేవిగా ఉంటాయి. బలమైన కథాకథనాలు పట్టుగా నడుస్తూ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో చెప్పుకోదగినది అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాము” అని చెప్పుకొచ్చాడు.