అతులిత బలదాముడే అందరికీ శక్తినివ్వాలి: చంద్రబాబునాయుడు

Share This

నేడు హనుమాన్ జయంతి
శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
నేడు శోభాయాత్రకు విస్తృత ఏర్పాట్లు
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “రాష్ట్ర ప్రజలందరికి హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు. అతులిత బలదాముడు శ్రీ ఆంజనేయుడు అందరికి శక్తి, సామర్థ్యాలనివ్వాలని కోరుకుంటున్నాను” అని వ్యాఖ్యానించారు. కాగా, నేడు హనుమజ్జయంతి సందర్భంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా భక్తులు హనుమాలయాలను సందర్శించి, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మక శోభాయాత్ర ప్రారంభం కానుంది. దీనికోసం పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కోటీ నుంచి సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకూ రహదారులపై ఆంక్షలు విధించారు.