అందుకే కారు గుర్తుకు ఓటెయ్యాలి: హరీశ్‌రావు

జిల్లాలోని కదలపూర్ మండలంలోని కలికోట సురమ్మ రిజర్వాయర్‌ను రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సురమ్మ చెరువు నీళ్లను చూస్తే బిర్యానీ తిన్న ఆనందం కలిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కన్నీళ్లు తెపిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని వసతులు కల్పించి రైతుల్లో ఆనందం నింపామన్నారు. తెలంగాణలో కరెంట్ ఫుల్.. నీళ్లు పుష్కలం చేసింది టీఆర్‌ఎస్ పార్టీ. అందుకే కారు గుర్తుకే ఓటెయ్యాలని మంత్రి పేర్కొన్నారు.