అంజలి చేసిన పనికి డైరెక్టర్ ముఖం పగిలిపోయింది!

మీరు చదివింది నిజమే… హీరోయిన్ అంజలి చేసిన పనికి డైరెక్టర్ ముఖం పచ్చడైంది. అయితే, ఈ పనిని ఆమె కోపంతో చేయలేదు. పొరపాటున జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఆమె ‘లీసా’ అనే సినిమాలో నటిస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా తన చేతిలో ఉన్న దోసె పెనంను కెమెరా ముందుకు ఆమె విసిరేయాలి.

డైరెక్టర్ చెప్పినట్టుగానే అంజలి చేసింది. అయితే, పొరపాటున ఆ పెనం డెరెక్ట్ గా వెళ్లి దర్శకుడి ముఖాన్ని ముద్దాడింది. దీంతో, ఆయనకు కనుబొమల మధ్య చిట్లి, తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి, కుట్లు వేయించారట. ఈ ఘటన పట్ల అంజలి చాలా బాధ పడిందట. షూటింగ్ సమయంలో ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతుంటాయని ఆమెను యూనిట్ సభ్యులు సముదాయిస్తున్నారట.